Saturday, 15 August 2015

వందేమాతరం 

బ్లాగు మిత్రులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. 
మనం ఈ రోజు 69వ స్వాతంత్ర్యదినోత్సవO  జరుపుకుంటున్నాం.

దేశ రక్షా పరం పుణ్యం
దేశ రక్షా పరం వ్రతం|
దేశ రక్షా పరో యాగ:
దేశ సేవా రతో భవేత్||

              దేశ రక్ష ను మించిన పుణ్యం గాని, వ్రతం గాని లేవు.
                దేశ సేవను మించిన యజ్ఞ యాగాలు అంతకన్నా లేవు. 
 ప్రతీ ఒక్కరూ దేశసేవలో నిమగ్నమ్ కావాలి. 

చాలా బాగుందండి! ఈ మాట అందరూ చెప్పేదే. 
 మరి 'దేశసేవ' అంటే ఏమిటి? 
మనం ఏం చేయ గలము? మీ అభిప్రాయాలను పంచుకోగలరు . 
..............మీ మీనా    

Tuesday, 11 August 2015



                                                                                                                         
      వీక్షకులకు హృదయ పూర్వక స్వాగతం. అంతర్జాలంలోకి  తొలిసారిగా ప్రవేశిస్తున్న నాకు మీ ప్రోత్సాహాన్ని, అభినందనలను  ఇస్తారని ఆశిస్తూ.....     మీ మీనా....... 
 నాకిష్టమైన  పద్యం .....                  ప్రణతులు


ఏ పుణ్యచరణాలు చేరినయంతనే

పదునాల్గు లోకాలు పరిఢవిల్లు,

ఏ పాద ధూళి సోకినయంతనే నాదు

తనువెల్ల పులకించి తనివి తీరు,

ఏ పద పీఠము ఈ హృది నిల్పగ

ఆనంద సంద్రాన అలలు పొంగు,

ఏ పద ద్వయమును ఈ చేత తాకంగ

కరతలమ్మంతయు కాంతులీను,


అట్టి నీ పదముల కడకు చేరినయంత

సకల శుభములమర సౌఖ్యమందు

పుణ్య చరిత కొలిచి పునీతంబయ్యెద

   ప్రణతులందుకొనుము పావనాంబ!